షారుక్ ఖాన్ కి గుండె పోటు.. గుజరాత్ లో ట్రీట్మెంట్
on May 23, 2024
మూడు దశాబ్దాలుగా హిందీ చిత్ర సీమని ఏకచత్రాధిపత్యంగా ఏలుతున్న నటుడు షారుఖ్ ఖాన్( Shah Rukh Khan) అభిమానులందరూ ముద్దుగా బాద్షా, కింగ్ ఖాన్ అని పిలుచుకుంటారు. సోషల్ మీడియా లో రీసెంట్ గా అయన కి సంబంధిచిన న్యూస్ ఒకటి స్ప్రెడ్ అవుతుంది. దీంతో ఆయన అభిమానులతో పాటు యావత్తు భారతీయ సినీ పరిశ్రమ ఒక్కసారిగా కలవర పాటుకి గురయ్యింది
ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ మ్యాచెస్ జరుగుతున్నాయి. వాటిల్లోని కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్‌కు షారుక్ యజమాని అనే విషయం అందరకి తెలిసిందే. ఇటీవల కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య సన్‌రైజర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ని చూడటానికి షారుఖ్ కూడా అహ్మదాబాద్ వచ్చాడు.
దీంతో అక్కడ ఉన్న ఎండ తీవ్రత వల్ల షారుఖ్ వడదెబ్బకు గురయ్యాడు. దీంతో పాటు లైట్ గా మైల్డ్ హాట్స్ట్రోక్ రావడంతో వెంటనే కేడీ ఆస్పత్రిలో చేర్పించారు. ట్రీట్ మెంట్ చేసిన వైద్యులు ప్రస్తుతం షారుఖ్ ఆరోగ్యం నిలకడగా ఉందని , అభిమానులు బయపడాలసిన అవసరం లేదని తెలియజేశారు.
ఇక షారుక్ ఉన్న హాస్పిటల్ చుట్టూ పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. షారుక్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్ధనలు చేస్తున్నారు. .కోల్‌కతా నైట్ రైడర్స్ సహ యజమాని షారుక్ స్నేహితురాలు అయిన జూహీచావ్లా షారుక్ ఆరోగ్యాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తుంది
![]( https://www.teluguone.com/images/g-news-banner.gif)
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
![](https://www.teluguone.com/tmdb/images/read-1.jpg)